చంద్రబాబుగారు.. నాటకాలు ఆపండి, ఇప్పుడెందుకండీ హడావుడి?: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

  • నాలుగేళ్ల పాటు మౌనంగా ఉన్నారు
  • ప్యాకేజీ నిధులను దండుకున్నారు
  • ఇప్పుడు లేనిపోని హడావుడి చేస్తున్నారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండి... ప్రత్యేక హోదా పేరుతో ఇప్పుడెందుకండీ నాటకాలు చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని దండుకున్నారని... ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో హోదా పేరుతో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.

పార్లమెంటులో భజన కార్యక్రమాన్ని నిర్వహించారని ఎద్దేవా చేశారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అనేది ప్రాంతీయ పార్టీలతో రాదని... జాతీయ పార్టీలతోనే అది సాధ్యమవుతుందని కోట్ల అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
kotla suryaprakash reddy
special status
congress

More Telugu News